
పూజా హెగ్డేను ప్రభాస్ ఎం చేశాడా? అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే....ప్రభాస్ ను చూసిన ఎవరికైనా ఓ అంచనా వచ్చేస్తుంది అతనికి ఫుడ్ అంటే ఇష్టం ఉండి ఉంటుందని. కానీ అతనితో పని చేసిన హీరోయిన్లకు మాత్రమే తెలుస్తుంది...ప్రభాస్ తన కో స్టార్స్ కు ఎలాంటి విందు భోజనాలు పెడ్తాడో. ఎన్నో సందర్భాల్లో ప్రభాస్ తో నటించిన హీరోయిన్లు తమకు రెబల్ స్టార్ పంపే క్యారిజిల గురించి, అందులో ఉండే నోరూరించే వంటకాల గురించి చెప్పడం జరిగింది. మొన్నీమధ్యే సాహో లో నటించిన శ్రద్ధా కపూర్ ప్రభాస్ పంపిన క్యారెజి చూసి అవాక్కయ్యి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సాక్షిగా ప్రభాస్ కు థాంక్స్ చెప్పింది. ఇప్పుడు అదే జాబితాలోకి చేరిపోయింది పూజా హెగ్డే. ప్రభాస్ తో 'జాన్' చిత్రంలో నటిస్తున్న పూజాకు కళ్ళు తిరిగే మెన్యూతో క్యారెజి పంపాడట. లంచ్ బాక్స్ ఐటెమ్స్ చూసి డైరెక్టర్స్ కోమాలోకి వెళ్లిపోయారని చెప్పుకొచ్చింది. నా పక్కన ప్రభాస్ ఉంటే తిండి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని తెలిపింది. నాకు ప్రభాస్ కు బిర్యానీ అంటే ఇష్టమని ఈసారి సెట్స్ కు వస్తే చెప్తా వెంటనే బిర్యానీ వస్తుందని అంటూ ప్రభాస్ స్టార్ విందు సేవించిన వారి ఖాతాలో చేరిపోయింది.