
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తిరుగులేని పాన్ ఇండియన్ స్టార్ అని అందరికి తెలిసిన విషయమే. బాహుబలి సినిమా తర్వాత బాలీవుడ్ మొత్తం ప్రభాస్ వ్యక్తిగత జీవితంవైపే చూస్తుంది. ప్రభాస్ కు సంబంధించిన ఎటువంటి న్యూస్ వచ్చిన చాలు దాన్ని గురించి అనేక కధనాలు రాస్తున్నారు. అల..ఇప్పుడు ఒక వార్తను ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ శివారుల్లో ఉన్న ప్రభాస్ ఫామ్ హౌస్ ఖరీదు సుమారు రూ.60 కోట్లు ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందొ పక్కన పెడితే ప్రభాస్ కు మాత్రం ఈ ఫామ్ హౌస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఖాళీ సమయం దొరికిన స్నేహితులతో కలిసి అక్కడే ఉంటూ రకరకాల వంటలను ఆరగిస్తూ ఎంజాయ్ చేస్తాడు. అందుకే దాని కోసం ప్రభాస్ భారీగా ఖర్చు పెట్టి ఉండొచ్చు కూడా.