
ప్రభాస్ క్లిన్ లవ్ స్టోరీలో కనపడి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలు తీస్తూ వస్తున్న ప్రభాస్ ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే పీరియాడిక్ లవ్ స్టోరీలో కనిపించనున్నాడని అభిమానులు సంబరపడుతున్నారు. కరోనా కారణంగానో మరే కారణంగా అయినా ప్రభాస్ సినిమా చూసి సంవత్సరం అయింది. ఇప్పుడున్న పరిస్థుతుల దృశ్య సినిమా ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం లేదు. అందుకే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కనీసం రాధే శ్యామ్ టీజర్ అయినా వస్తుంది అనుకుంటే కేవలం పోస్టర్ తో సరిపెట్టింది చిత్ర యూనిట్. సినిమాలో ప్రభాస్ 'విక్రమ్ ఆదిత్యగా' కనిపించనున్నట్లు పాత్ర పేరును పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ స్టైలిష్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. పోస్టర్ లో ప్రభాస్ ను చూసేందుకు రెండు కళ్ళు సరిపోకకపోయిన పోస్టర్ ఒక్కటే కాకుండా చిన్న టీజర్ ను రిలీజ్ చేయాల్సింది అంటూ అభిమానులు నిరాశపడ్డారు. ఇదంతా పక్కన పెడితే పోస్టర్ లో మాత్రం రెబల్ స్టార్ అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తూ మరోసారి అమ్మాయిలతో 'ఎం ఉన్నాడ్రా బాబు' అనేలా చేస్తున్నాడు.