
బిగ్ రెబెల్ స్టార్ కృష్ణరాజు జనవరి 20, 2020 న 81సంవత్సరంలోకి అడుగు పెట్టారు. కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ బాబు, లక్ష్మి మంచు, విష్ణు మంచు మరియు ఇతరులు
కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్న పార్టీలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకల్లో కనిపించారు. ఈ సందర్భంగా చిరుతో ప్రభాస్ మాట్లాడుతుండగా తీసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఇప్పుడు చిరంజీవితో ప్రభాస్ ఉన్న చిత్రం
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాహుబలి స్టార్ ప్రభాస్ నల్ల కుర్తా, పైజామా వేసుకోని హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. మెగాస్టార్, రెబల్ స్టార్ ఒకే ఫ్రెమ్ లో ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. లక్ష్మి మంచు కూడా తన ఇన్స్టాగ్రామ్లో కృష్ణంరాజు పుట్టినరోజు పార్టీ నుండి కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఫ్యామిలీ ఫొటోతో కృష్ణంరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ పార్టీలోని పలు ఫోటోలు ఇప్పుడు అంతటా వైరల్ గా మారాయి.