
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. కొద్ది రోజుల క్రితం రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసిన యంగ్ రెబల్ స్టార్ తాజాగా ఆది పురుష్, సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ప్రభాస్ నేషనల్ స్టార్ డం సాధించినప్పటికీ చాలా ఒదిగి ఉంటారు. తన మూవీకి పని చేసే వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని రాధే శ్యామ్ సినిమా కోసం పని చేసిన యూనిట్ అందరికి రిస్ట్ వాచ్ గిఫ్ట్‌గా అందించారు. ఈ గిఫ్ట్ చూసి అందరు ఆనందించారు. ప్రభాస్ మంచి మనసుపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలోను ప్రభాస్ పలు గిఫ్ట్స్ అందించారు అంతేకాదు తన మూవీ టీం కోసం ఇంటి దగ్గర నుండి భోజనం తీసుకొచ్చి ఆనందింపజేశాడు.