
తెలుగు నాట ఉన్న స్టార్ హీరోల్లో పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ పెంచుకున్న ఏకైక స్టార్ ప్రభాస్. అందుకనే రెబల్ స్టార్ ప్రతి సినిమా భారీ బడ్జెట్ తో, హంగులతో నిర్మించబడుతుంది. మరి అన్ని భాషల వారిని ఆకట్టుకోవాలంటే ఔట్ పుట్ కూడా ఆ స్థాయిలో ఉంది తీరాల్సిందే కదా. కానీ ఈనేపథ్యంలో ప్రభాస్ రేస్ లో వెనుబడుతూ, అభిమానుల ఓపికను పరిక్షిస్తున్నాడు. సినిమా సినిమాకి రెండేళ్ల సమయం తీసుకుంటూ మంచి పిక్ లో ఉన్న టైంను వృధా చేసుకుంటున్నాడు. సాహో తర్వాత తెరకెక్కుతున్న 'రాధే శ్యామ్' చిత్రం కూడా కరోనా కారణంగా ఏడాది చివరికి షూటింగ్ ను ప్రారంభించి అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరం లేదా 2022 నాటికి ఆలస్యం కావడం ఖాయం. ఇక ఆ తర్వాత నాగ్ అశ్విన్ తో తెరకెక్కబోయే సినిమాకు కనీసం ఏడాది పైనే పడుతుంది. మరి ఒక్కో సినిమాకి ఇంత గడువు తీసుకుంటే కష్టమే!