
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన బుజ్జిగాడు, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ లో నటించిన సంజ్జన గల్రాని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. అయితే ప్రస్తుతం సంచలన విషయమై సంజ్జన వార్తల్లో నిలిచింది. బెంగళూరులో ప్రొడ్యూసర్ వందనతో ఇమేకు పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఒక హోటల్ లో జరిగిన పార్టీలో సంజ్జన ప్రొడ్యూసర్ వందనాకు మధ్య సంభాషణ రాగా అది కాస్త గోడవగా మారి సంజ్జన బియర్ బాటిల్ తో ప్రొడ్యూసర్ వందన తలపై కొట్టిందట. దీంతో వెంటనే వందన కబన్ పార్క్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఎఫైర్ ఫైల్ చెయ్యమని కోరారట. మరోపక్క ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంది. విచారణ జరుగుతున్న సమయంలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. సంజ్జన మాత్రం అటువంటిదేం జరగలేదంటూ చెప్పుకొచ్చింది.