
'అతనొక్కడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఆతర్వాత అతని డైరెక్షన్లో వచ్చిన కిక్, రేస్ గుర్రం, ధ్రువ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇక గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా వచ్చిన 'సైరా నరసింహరెడ్డి' పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయ్యి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ దక్కించుకుంది. సైరా హిట్ అవ్వడంతో తాను పాన్ ఇండియా లెవెల్ సినిమాలను మాత్రమే తీయ్యాలని ఫిక్స్ అయ్యాడట. ఈమేరకు రెబల్ స్టార్ ప్రభాస్ తోనే తన తదుపరి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యి కధ సిద్ధం చేసుకోని ప్రభాస్ కు వినిపించాడు. కధ విన్న ప్రభాస్ అది పాన్ ఇండియా లెవల్ కి సెట్ కాదని భావించి నో చెప్పాడట. దీంతో మళ్ళీ మెగా హీరోనే నమ్ముకున్నాడు. ఆ కథనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు సురేందర్ రెడ్డి చెప్పాడట. వరుణ్ ఆ కథకు ఒకే చెప్పాడని, ఈ సినిమాని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం.