
మరో రోజు, ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రం, మహానటి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ తో ప్రకటించడంతో అందిరికి పెద్ద షాక్ కలిగింది. అలాగే, 2021లో దేశవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని వైజయంతి ఫిల్మ్స్ బ్యానర్‌పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి, వారు ఎటువంటి సినిమా చేస్తున్నారా అనే అందరిలోనూ నెలకుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రతిచోటా సంచలనం నెలకుంది. ఈ కథకు సైన్స్-ఫిక్షన్ థీమ్ తో నడుస్తుందని, ఎక్కువగా 'టైమ్ మెషిన్' కాన్సెప్ట్ సెంటర్ స్టేజ్ గా ఉందని తెలుస్తోంది. హాలీవుడ్లో ఇలాంటి టైమ్ ట్రావెల్ సినిమాలు వచ్చినప్పటికీ, తెలుగులో 90స్ లో విడుదలైన బాలయ్య యొక్క 'ఆదిత్య 369' మినహా మరే చిత్రం లేదు. దేశవ్యాప్తంగా తన అభిమానులని ఆకర్షించడానికి ప్రభాస్ నిజంగా ఆసక్తికరమైన స్క్రిప్ట్‌ను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రాన్నికి భారీ విఎఫ్క్స్ అవసరం, దీనికోసం దర్శకుడు కెనడా, అమెరికాలలో విఎఫ్క్స్ చేపించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికి చిత్ర ప్రి ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.