
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పూజ హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాధే శ్యామ్' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడప్పుడు చెట్లు నాటడానికో లేదా అతని స్టాఫ్ కు గిఫ్ట్ ఇస్తూనే దర్శనమిస్తున్న ప్రభాస్ తాజాగా న్యూ లుక్ లో కనిపించారు. కండలతో, గడ్డంతో భారీగా ఉన్న ప్రభాస్ ఒక్కసారిగా క్లిన్ షేవ్ చేసుకొని సన్నగా కనిపించారు. ప్రభాస్ న్యూ లుక్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రభాస్ కొత్త లుక్ ను చూసి షాక్ అవుతున్నారు. ఎందుకు ఒక్కసారిగా ఇంత సన్నబడ్డాడంటూ అవ్వక అవుతున్నారు. అయితే రాధే శ్యామ్ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో చేయబోయే సినిమా కోసం డార్లింగ్ సన్నబడి ఉంటాడని అభిమానులు అనుకుంటున్నారు. మొత్తానికి సినిమా కోసమే ప్రభాస్ తగ్గాడు కానీ ఏ సినిమా అనేదే క్లారిటీ లేదు.
Tags: #Cinecolorz #Prabhas #Prabhas21