
నాగ్ అశ్విన్ బాహుబలి స్టార్ ప్రభాస్‌తో తన తదుపరి సినిమాను ప్రకటించినప్పటి నుండి, ఈ రాబోయే ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవటానికి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు. మీడియా మరియు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న సమాచారం నిజమైతే, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో ప్రభాస్ సరసన నటించేందుకు దీపికా పదుకొనేను ముడి వేయాలని ఆలోచిస్తున్నాడని ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ అని నాగ్ అశ్విన్ మొన్నీమధ్యే ప్రకటించాడు. 2021లో సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాత అశ్విని దత్ ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సినీ సిర్కిల్స్ హల్ చల్ చేస్తుంది. అదే, సినిమా కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి. ప్రొడక్షన్ ఖర్చులు అన్ని లెక్కేసిన తరువాత, నిర్మాత అశ్విని దత్ 60% లాభాలను ప్రభాస్‌కు వేతనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు నివేదికలు వస్తున్నాయి. అన్నీ సరిగ్గా జరిగితే, ప్రభాస్ తన రెమ్యునరేషన్ గా దాదాపు 100-120 కోట్ల రూపాయలు అందుకుంటాడు. ఈ సినిమాను 200కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.