
బాహుబలి సినిమాతో ఇంటెర్నేష్నల్ స్టార్ అయిన రెబెల్ స్టార్ ప్రభాస్ ఆ సినిమా తర్వాత నుంచి అన్ని పాన్ ఇండియన్ మూవీస్ తీస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన చివరి చిత్రం 'సాహో' బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన రీతిలో ఆడకపోయినప్పటికీ ఓపెనింగ్స్ భారీగా ఉండటంతో నష్టాలైతే రాలేదు. ఇక ఇప్పుడు రాధ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న'రాధే శ్యామ్' లో ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభాస్ లవర్ బాయ్ అవతారంలో కనిపించనున్నాడు. పూజా హెగ్డే తో ఈ చిత్రంలో పీరియాడిక్ లవ్ స్టోరీ నడిపించనున్నాడు. అయితే కరోనా దృష్ట్యా కొన్ని నెలల పాటు షూటింగ్ నిలిపివేసిన టీం గత నెల కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఇటలీలో షూటింగ్ మొదలుపెట్టారు. ఇక నిన్నటితో ఇటలీ షెడ్యూల్ పూర్తయ్యిందని అక్కడ ప్యాకప్ చెప్పాసి తిరిగి హైదరాబాద్ లో మళ్ళీ ప్రారంభిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సందర్బంగా ఇటలీ నుండి హైదరాబాద్ కు తిరిగొస్తుండగా ఎయిర్పోట్ లో ప్రభాస్ మరియు పూజ హెగ్డే దర్శనమిచ్చారు.