
టాలీవుడ్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తన చెయ్యబోయే సినిమాలకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిసితే కంగుతినాల్సిందే. ప్రభాస్ ప్రస్తుతం ఒప్పుకున్న ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమా మరియు రాధేశ్యామ్ చిత్రాలకు గాను సుమారు రూ.100 కోట్లు వేతనం తీసుకుంటున్నట్లుగా సినిమా వ్యాపార విశ్లేషకులు చెబుతున్నారు. అంటే సగటున ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.75 నుంచి 80 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అదే ప్రభాస్ చేస్తున్న ఈ మూడు చిత్రాల్లో ఏ రెండు చిత్రాలు విజయం సాధించిన ఇక ప్రభాస్ దరిదాపుల్లోకి ఏ హీరో రాలేరు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.