
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి లాంటి ఇంటెర్నేష్నల్ స్థాయి సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ సుజీత్ తో 'సాహో' సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇలాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాల తర్వాత రాధా కృష్ణ దర్శకత్వంలో పీర్యాడిక్ లవ్ స్టోరీతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ జంటగా పూజా హెగ్డే నటిస్తుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన టీం బాహుబలి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తుంది. బాహుబలి2 సినిమా రిలీజ్ అయిన రోజునే ఏప్రిల్ 28 2021లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట. తనను పాన్ ఇండియా స్టార్ చేసిన బాహుబలి రిలీజ్ డేట్ రోజు రాధే శ్యామ్ రిలీజ్ అవుతే బాగుంటుందని ప్రభాస్ భావించటంతో చిత్ర యూనిట్ అందుకు అనుగుణంగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.