
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తో 'సాహో' యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఇప్పుడు శ్రద్ధా కపూర్ తరువాత, ప్రభాస్ కత్రినా కైఫ్ తో రొమాన్స్ చేయలనుకుంటున్నాడు. సాహోకు శ్రద్ధా కపూర్ మొదటి ఛాయిస్ కాదని అందరికీ తెలుసు. ప్రారంభంలో, మేకర్స్ కత్రినా కైఫ్‌ను సంప్రదించారు, కానీ ఆమె డేట్స్ లను కేటాయించలేక పోవడంతో, ఆమె ఆఫర్ ను తిరస్కరించింది. అప్పుడు ఈ పాత్ర శ్రద్ధా కపూర్ ఒడిలో పడింది. ఇదిలావుండగా, మహానటి ఫెమ్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ జతకట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్న ఈ చిత్రంను అశ్విని దత్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం ప్రభాస్ హీరోయిన్ గా కత్రినా కైఫ్‌ను తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన చర్చ కొనసాగుతోంది. ప్రతిదీ తదనుగుణంగా జరిగితే, కత్రినా కైఫ్ చేరికకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది.