
రితేష్ రాణా దర్శకత్వంలో వచ్చిన "మత్తు వదలరా" సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు శ్రీ సింహ హీరోగా పరిచయమయ్యాడు. అంతేకాదు మరో కొడుకు కాళ భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో సినిమా చూసిన వారు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కేవలం సినీ విమర్శకులే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖులు సైతం అభినందనలు తెలియజేస్తున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి సినిమాపై ఫీడ్ బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రాజమౌళి, అతని కుటుంబ సభ్యులతో మంచి సాన్నిహిత్యం ఉన్న ప్రభాస్ "మత్తు వదలరా" సినిమాను చూసి బాగా నచ్చడంతో టీంతో ముచ్చటించారు. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే టీంతో ప్రభాస్ సంభాషణా వీడియో రిలీజ్ కానుంది.