
శర్వానంద్, అక్కినేని సమంత జంటగా నటించిన రొమాంటిక్ డ్రామ "జాను" ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు జాను అనే టైటిల్ పెట్టినప్పుడు నుండి ఆసక్తి నెలకుంది. ప్రభాస్ నటిస్తున్న ప్రస్తుత చిత్రంకు కూడా "జాన్" అనే టైటిల్ ను పెట్టడం జరిగింది. దీంతో రెందు సినిమాలకు ఒకే టైటిల్ ఎలా సాధ్యమైందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. వాటికి తాజా ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. తనకు టైటిల్ ఇచ్చినందుకు ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. “నేను 96ని చూసినప్పుడు, తెలుగు వెర్షన్‌కు జాను సరైన టైటిల్ అవుతుందని భావించాను. ప్రభాస్20 మేకర్స్ జాన్ ను తమ సినిమా టైటిల్ గా భావిస్తున్నారని నాకు తరువాత తెలిసింది. నేను వెంటనే యువి క్రియేషన్స్‌ను సంప్రదించాను. కొన్ని రోజుల తరువాత, నాకు వారి నుండి కాల్ వచ్చింది. వారు నాకు జాను అనే టైటిల్ వాడటానికి అనుమతి ఇచ్చారు. నాకు టైటిల్ ఇచ్చినందుకు ప్రభాస్‌కు కృతజ్ఞతలు ”అని దిల్ రాజు అన్నారు.