
భారతదేశంలో ప్రభుదేవా గురించి పరిచయం అవసరం లేదు. డ్యాన్స్ తెల్సిన వాలందరికి ప్రభుదేవా కచ్చితంగా సుపరిచితులే కొంతమందికైతే ఆరాధ్య దైవం కూడా. ఇది ఇలా ఉంటే ప్రభుదేవా వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు ఇదొక చర్చ జరుగుతూనే ఉంటుంది. మరి ముఖ్యంగా అయన ప్రేమ, పెళ్లి విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. అయితే తాజాగా ప్రభుదేవా తన ఫిజియోథెరఫిస్ట్ ను ముంబైలో సీక్రెట్ గా పెళ్లి చేయూస్కున్నారని వార్తలొస్తున్నాయి. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతూ ఫిజియోథెరఫిస్ట్ ను కలవడం ఆ తర్వాత ఒకరినిఒకరు ఇష్టపడటంతో ఆలస్యం చేయకుండా ముంబైలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని వార్తలొస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందొ తెలియాల్సి ఉంది.