
మాచిరాజు ప్రదీప్, బుల్లితెర మీద నిజంగానే బాగా వినపడే పేరు ఇది. ఫీమేల్ యాంకర్స్ అంటే బాషా రాకపోయినా అందచెందాలతో మ్యానేజ్ చేయొచ్చు కానీ మెల్ యాంకర్స్ అలా కాదు. పూర్తి టాలెంట్ తో పైకి రావాలి. అలా టాలెంట్ తో తన కష్టంతో పైకొచ్చిన యాంకర్ ప్రదీప్. ఇప్పుడు హీరో ప్రదీప్ కూడా. అయితే ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెరను ఏలుతూ వస్తున్న ప్రదీప్, జీ తెలుగులో తన సొంత బ్యానర్ లో 'కొంచెం టచ్ లో ఉంటే చెప్తా' అనే షో పలు సీజన్లు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మంచి టీఆర్పీలతో కొనసాగింది. అందుకని ఇప్పుడు సరికొత్త సీజన్ తో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈనేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన ప్రదీప్ ఈ షోకు పవన్ కళ్యాణ్ ని తీసుకురావాలని మొదటి నుండి ప్రయత్నాలు చేస్తున్నాడు. సీజన్ 5 లో తోలి ఎపిసోడ్ లో పవర్ స్టార్ ని ఇంటర్వ్యూ చేసి ఈ సీజన్ ని ఘనంగా ఆరంభించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ మేరకు రీసెంట్ గా పవర్ స్టార్ ని ప్రదీప్ కలిసినట్లు తెలుస్తుంది. మరి పవన్ నిర్ణయం ఏమిటో, షోకు వస్తారో రారో కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.