
బుల్లితెర రారాజుగా కీర్తించబడుతున్న ప్రదీప్ మాచిరాజు పలు షోస్తో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇన్నాళ్లు బుల్లితెరపై సందడి చేసిప ప్రదీప్ వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం గత ఏడాది మార్చిలో విడుదల కావలసి ఉన్న కరోనా వలన వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమా కోసం ప్రదీప్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, కొద్ది సేపటి క్రితం జనవరి 29న చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ‘నీలి నీలి ఆకాశం’ పాట ఎలాగైతే ఆకట్టుకుందో, సినిమా కూడా ప్రేక్షకుల్ని అలాగే అలరిస్తుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.