
ఇప్పుడు ఏ ఇండస్ట్రీ చూసినా వెబ్ సిరీస్ లపై పడ్డారు. కరోనా పుణ్యమాని థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలీదు, రిలీజ్ అవ్వాల్సిన సినిమాల సంగతేంటో అర్ధం కానీ పరిస్థితుల్లో అల..ఎదురుచూస్తూ కూర్చోలేక డిజిటల్ దునియాలో బిజీగా ఉంటూ గల్లాపెట్టె నింపుకునే ఆలోచన చేస్తున్నారు. కేవలం దర్శకులు, నిర్మాతలే కాదు హీరో హీరోయిన్లు తాజాగా విలన్ లు కూడా అదే అలోచించి రంగంలోకి దిగుతున్నారు. తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి ఒక ప్రత్యేకమైన వెబ్ సిరీస్ కోసం ఒక్కటయ్యారని తెలుస్తుంది. ఓటిటి దిగ్గజం నెట్ఫ్లిక్స్ పరువు హత్యలపై తమిళ్ వెబ్ సిరీస్ ను నిర్మించాలని ప్లాన్ చేస్తుందట. ఇందుకోసం డైరెక్టర్ వెట్రిమారన్ ను సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్, కూతురి పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నట్లు అంచనా. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.