“అశ్వద్ధామ”కు అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్! నాగశౌర్య కెరీయర్లోనే మొదటిసారి

రమణ తేజ దర్శకత్వం వహించిన "అశ్వద్దామ" నాగ శౌర్య గత సంవత్సరంలో నిరాశపరిచిన చిత్రాలు చేసినందుకు చాలా ఆశలు పెట్టుకున్న చిత్రం. ఈ చిత్రం అతని తల్లి ఉషా నిర్మిస్తున్నారు. ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పుడు అందుతున్న వార్త ఏమిటంటే, ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ 15 కోట్లకు లాక్ చేయబడింది. ఇది నాగశౌర్య కెరీర్లోనే అత్యధికంగా చెప్పొచ్చు. ఆకట్టుకునే థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయికగా నటించింది. ఈ నెల 31 న విడుదల కానున్న ఈ చిత్ర టీజర్, ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ దక్కింది. నాగ శౌర్య తన కెరీర్లో తొలిసారిగా యాక్షన్ హీరో అవతారంలో కనిపిస్తున్నాడు. ట్రైలర్లో చూపిన విధంగా మిస్టరీ థ్రిల్లర్గా ఉన్న ఈ ప్రాజెక్టుపై శౌర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం యొక్క స్క్రీన్ ప్లే సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. సన్నివేశాలు మరియు మలుపులు చూపించిన విధానం ప్రేక్షకులను పూర్తిగా థ్రిల్ చేస్తుందట.