
ప్రభాస్ రాజు స్థాయి బాహుబలితో ఎలా పెరిగిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక టాలీవుడ్ హీరో స్థాయి నుంచి పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ చేతిలో ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. ఒక పక్క రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాధే శ్యామ్' రిలీజ్ కు సిద్ధమవుతూండగా తాజాగా కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తున్నట్లుగా మొన్నీమధ్యే ప్రకటించిన విషయం విదితమే. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే....బాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ కి ఎదిగిన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఒక స్పెషల్ సాంగ్ కోసం సంప్రదించినట్లు సమాచారం. మరి ఈ బ్లాబాల్ బ్యూటీ అందుకు అంగీకరిస్తుందా లేదా అనేది పక్కనపెడితే ఒకవేళ ఒప్పుకుంటే ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తుందనేది మరో లెక్క.