
రోజుకో చోటా రోజుకో ఘటన జరుగుతుంది. తెల్లారితే ఎటువంటి వార్త వినాల్సి వస్తుందోనని భయమేస్తోంది. అయితే నిన్న సాయంత్రం షాద్ నగర్లో హత్యకు గురైంది డాక్టర్ ప్రియాంక రెడ్డి. ఈ హత్య కేసు కలకలం రేపుతోంది. మాదాపూర్లో ట్రీట్మెంట్ కు వెళ్లొస్తున్న ప్రియాంక స్కూటీ దారిలో ఆగిపోవటంతో ఆమె చెల్లికి ఫోన్ చేసి నా స్కూటీ ఆగిపోయింది. నా చుట్టుపక్కల లారీ డ్రైవర్లు ఉన్నారు. భయంగా ఉందని వివరించి మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేసిందట. రాత్రి ప్రియాంక ఇంటికి రాకపోవటంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాద్ నగర్ సమీపంలో ఓ యువతి మృతదేహం పూర్తిగా కాలిపోయిన మృతదేహం ఉందని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించగా...అక్కడికి చేరుకున్న వాళ్ళు ఆ మృతదేహాన్ని చూసి ప్రియాంకగా గుర్తించారు. అయితే ప్రియాంకాను హత్య చేసింది ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రైవర్లే ఈ హత్యకు కారణమా? లేదా మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో ఎక్కువగా దృష్టి పెట్టి విచారణ కొనసాగిస్తున్నారు.