
కొన్ని రోజుల ముందు షాద్ నగర్లో జరిగిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసు దేశాన్ని కుదిపేసింది. ఇంకా ఎంతమంది ఆడపడుచులు ఇలాంటి దుర్ఘటనలకు బలవ్వాలి అంటూ నిరసనలు తెలియజేస్తూ....నేరస్తులకు వెంటనే శిక్ష పడాలంటూ పోరాడుతున్నారు. ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధానికి వినతి లేఖ రాశారు. హైదరాబాద్ వైద్యురాలి హత్యాచారం కేసులో నిందితులను వెంటనే పట్టుకున్నారు. తమ బిడ్డను కోల్పోయిన తర్వాత దుఃఖంలో ఉన్న ఆమె కుటుంబానికి ఏవిధంగా ఓదార్చాలో అర్థం కావడం లేదు. ఇలా అత్యాచార నిందితులకు శిక్ష అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. న్యాయం ఆలస్యమైతే అన్యాయం జరిగినట్లే. నిచులకు వేగంగా కఠిన శిక్ష విధించేలా ఇండియన్ పినల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ చట్టాలను మార్చాలి" అని ప్రధానికి విజ్ఞప్తి చేసారు.