
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిని అతిక్రూరంగా రేప్ చేసి హత్య చేసి మృతదేహాన్నీ కిరోసిన్ పోసి కాల్చేశారు. ఈ ఘటన విని దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్ట పగలు, మిట్ట మధ్యాహ్నం, అర్ధరాత్రి ఇలా సమయం ఏదైనా సరే అమ్మాయిలకు బయట భద్రత లేకుండా పోతుంది. ఎటువైపు నుంచి ఏ కామాంధుడు వచ్చి హింసిస్తాడో తెలియని రోజులు. ప్రియాంక హత్య కేసు కలకలం రేపుతోంది. అయితే రేప్ చేసి హత్య చేసింది నలుగురిగా గుర్తించిన పోలీసులు వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఏ1 ముద్దాయిగా మహుమద్, ఏ2 ముద్దాయిగా శివ, ఏ3 గా నవీన్, ఏ4 గా చెన్నకేశవులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అంతా ప్లాన్ ప్రకారం స్కూటీ టైర్లో గాలి కొట్టిస్తానని చెప్పి నమ్మించి ఆమెను ట్రాప్ చేసి కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేసి దహణం చేశారు. ఈ కేసును మహబూబ్ నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించారని తెలిపారు. నిందితులకు త్వరగా కఠిన శిక్షపడేలా చేస్తామని స్పష్టం చేశారు.