రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది ? మొన్నటి వరకు సౌత్ లో ఆ పేరు తెలియని వాళ్ళు ఉంటారా అని అనేది కాస్త ప్రపంచంలో తెలియని వాళ్ళు ఉంటారా అనేదాకా మారిందంటే ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో ఊహించుకోవచ్చు. బాహుబలి సినిమా కోసం ఏ హీరో కేటాయించనంత సమయం కేటాయించాడు. అందుకే ఆ కష్టం ఎక్కడికి పోలేదు. ఇప్పుడు ప్రభాస్ అంటే ఇష్టపడని వాళ్లుండరు. స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే అందుకు అతీతమేమి కాదు. అయితే పూజ హెగ్డే ప్రభాస్ తదుపరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ హెగ్డే ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
"చిత్ర పరిశ్రమలో నేను కలుసుకున్న మంచి వ్యక్తుల్లో ఆయన ఒకరు. నిజాయితీగా ఉంటారు. మంచి స్వభావం ఉన్నవారు... ఎందుకంటే స్టార్ అన్న ఫీలింగ్ తో కాకుండా డౌన్ టూ ఎర్త్ ఉంటారని" తెలిపింది.
"చిత్ర పరిశ్రమలో నేను కలుసుకున్న మంచి వ్యక్తుల్లో ఆయన ఒకరు. నిజాయితీగా ఉంటారు. మంచి స్వభావం ఉన్నవారు... ఎందుకంటే స్టార్ అన్న ఫీలింగ్ తో కాకుండా డౌన్ టూ ఎర్త్ ఉంటారని" తెలిపింది.