
బిగ్ బాస్ సీజన్ 3 కంటేస్టెంట్ పునర్నవి భోపాలం 'ఉయ్యాల జంపాల' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులచే మంచి గుర్తింపు పొందింది. ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన ఈ భామ తనదైన రితిలో ప్రేక్షకులను మెప్పించింది. మరి ముఖ్యంగా ఆ సీజన్ లో పునర్నవి మరియు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మధ్య సాన్నిహిత్యం చూసి వారిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. ఒకానొక సమయంలో ఎక్కడ విన్న వీరి టాపికే. ఆ రేంజ్ లో వార్తల్లో నిలిచిన పున్ను సీజన్ అయ్యాక పలు కార్యక్రమాలతో, వెబ్ షోలతో బిజీగా గడుపుతుంది. అయితే తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో నిశ్చితార్థపు ఉంగరం పెట్టుకొని ఫోటో పెట్టింది. దానికి 'మొత్తానికి ఇప్పుడు జరుగుతుంది' అనే క్యాప్షన్ ఇచ్చింది. మరి అది నిజంగానే ఆమె నిశ్చితార్థపు రింగేనా లేదా ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం పెట్టినదా అనేది పునర్నవినే చెప్పాలి.