
బిగ్గెస్ట్ రియాల్టీ షో అయిన బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో వచ్చిన మూడు సీజన్లు విజయవంతం అయ్యాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 4 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు షో నిర్వాహకులు అప్ డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ లు మళ్ళీ మొదలవ్వడంతో బిగ్ బాస్ సీజన్ 4 సరికొత్త హంగులతో ముస్తాబవుతుంది. అయితే ఆ షోలో ఎవరు పార్టిసిపేట్ చేస్తారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో మొదలయ్యింది. ఈ తరుణంలో బిగ్ బాస్ పై ఎక్స్ కంటెస్టు అయిన నటి పునర్నవి సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ ద్వారా ఎంతోమందికి పోయిన క్రేజ్ తిరిగి వచ్చింది, అసలు గుర్తింపే లేని వారికి గుర్తింపు దక్కింది, సినిమాల్లో సిరియల్లో అవకాశాలు వచ్చాయి. అటువంటి షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరై, తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకోని ఇప్పుడు అదే షో మీద కామెంట్స్ చేసింది పున్ను. తాజాగా సోషల్ మీడియాలో ఆమె మరియు మరొక వ్యక్తి ప్లకార్డులు పట్టుకున్న ఒక చిత్రాన్ని పోస్ట్ చేసింది. అందులో ఆ వ్యక్తి నువ్వు బిగ్ బాస్ కు వెళ్లి ఎం నేర్చుకున్నావ్ పున్ను? అని అడుగగా, దానికి ఆమె సమాధానంగా 'బిగ్ బాస్ కి వెళ్లకూడదని' అని రాసింది. ఈ పోస్ట్ చేయడం ఆలస్యం, ఆమెపై ట్రోల్స్ మొదలయ్యాయి. అవకాశం ఇచ్చిన వేదికను ఎప్పుడు కించపరచకూడదని నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. అయితే పున్ను అల...అనడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.