
టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు గాంచిన పూరి జగన్నాథ్, తాజాగా 'ఇస్మార్ట్ శంకర్' తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా లెవల్ లో 'ఫైటర్' అనే సినిమాను తీస్తున్నారు. ఇకపోతే పూరి తదుపరి చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉండబోతుందని మీడియా వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా యాక్టర్ మరియు నిర్మాత బండ్ల గణేష్ పవన్ తనతో సినిమా చేయటానికి ఒప్పుకున్నారని సోషల్ మీడియా వేదికగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే పవన్ హీరోగా బండ్ల గణేష్ నిర్మించబోయే ప్రాజెక్ట్ కు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. పవన్-పూరి కాంబోలో ఇప్పటికే బద్రి, కెమెరామాన్ గంగతో రాంబాబు లాంటి రెండు చిత్రాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మూడోసారి ఈ కలయికలో సినిమా వస్తుందంటే అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి.