
ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు కేవలం సౌత్ లోనే కాక బాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు. ఏకంగా బీ టౌన్ ముద్దుగుమ్మలు కొందరు విజయ్ పై ప్రశంసలు కురిపించారు. అందులో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఒకరు. ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ చూడటానికి బాగుంటాడాని, నటన ఎంతో స్టయిల్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. అంతే అప్పటి నుంచి ఈ ఇద్దరు ఒక సినిమాలో నటించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఆ పుకారు త్వరలోనే నిజం కాబోతోంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఒక నిర్మాతగా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు కరణ్ జాన్వీను ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాలని చెప్పి ఒప్పించడట. దానికి కారణం అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ కానుంది.