
టాలీవుడ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను 'చిరుత' సినిమాతో పరిచయం చేశాడు పూరి జగన్నాథ్. ఇక ఆ తరువాత చరణ్ కు తిరుగు లేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' సినిమాలో అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాథ్ మరోసారి రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా 'ఫైటర్' అనే పాన్ ఇండియా సినిమాకు దర్శకత్వం వహిస్తున్న పూరి, రామ్ చరణ్ తో కూడా పాన్ ఇండియా సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. అన్నీ కుదిరితే, 2021లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.