
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇంటలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమా లుక్ టెస్ట్ అవ్వగానే కరోనా మహమ్మారి రావటంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. మళ్ళీ కరోనా నిబంధనలను సడలించటంతో ఎంతో పకడ్బందీగా మారేడు పల్లి దగ్గర ఉన్న ఫారెస్ట్ లో షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. మూడు వారల నుంచి నిర్విరామంగా సాగుతున్న తరుణంలో మొన్న అల్లు అర్జున్ కు హైదరాబాద్ కు తిరిగి రావటంతో ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. యీనిట్ లో కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చిందని దాంతో పుష్ప సినిమా షూటింగ్ ఆపేసి చిత్ర యూనిట్ హైదరాబాద్ వచ్చేశారని వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ సుకుమార్ ఐసోలేషన్ కు వెళ్లారని కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియడం లేదు. చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవటంతో ఈ వార్త నిజమా కాదా అనే డైలామాలో ఉన్నారు.