
తెలుగు జాతి గర్వపడేలా చేసిన క్రీడాకారిణి పీవీ సింధును గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే డిప్యూటీ కలెక్టర్ గా శిక్షణా కాలం పూర్తి చేసుకోని పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సింధుకు ప్రస్తుత జగన్ ప్రభుత్వం ఆసక్తికరమైన పోస్టింగ్ ఇచ్చింది. హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉండటంతో దాన్ని ఓఎస్డీగా అప్గ్రేడ్ చేయడానికి ప్రతిపాదనలు పంపాలని ప్రోటోకాల్ డైరెక్టర్ ను ప్రభుత్వం అధిశించింది. ఈ మేరకు పీవీ సింధుకు హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ వద్ద ఓఎస్డీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ సింధుకి 2018 డిసెంబర్ 7 నుంచి 2020 ఆగస్టు 30 వరకు ఆన్ డ్యూటీ సౌకర్యం ఇచ్చింది ప్రభుత్వం. అయితే రేపటి నుంచి వచ్చే ఆగస్టు 30 వరకు తాను ఒలింపిక్స్ శిక్షణ కోసం సెలవులో వెళ్తానని సీఎం జగన్ ను కోరగా అందుకు జగన్ అంగీకరించినట్లు తెలుస్తోంది.