
టాలీవుడ్ లోని యంగ్ హీరోలతో నటించిన సుప్రీం బ్యూటీ రాశి కన్నా ఇప్పటి వరకు స్టార్లతో కలిసి పని చేయలేదు. రామ్, సాయి ధరమ్ తేజ్, నాగ శౌర్య, గోపీచంద్ వంటి స్టార్లతో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది 'ప్రతిరోజు పండగే', 'వెంకీ మామ' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈమె ఈ ఏడాది రిలీజ్ అయిన 'వరల్డ్ ఫెమస్ లవర్' తో ఫ్లాప్ ను ఎదురుకుంది. దీంతో ఆమె మార్కెట్ కాస్త పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆమెకు హిట్ పడితే కానీ బండి దారిలో పడదు. అందుకే కోలీవుడ్ లో ఒక హిట్ కొట్టి టాలీవుడ్ లో మార్కెట్ పెంచుకోవాలని చూస్తుంది. ఈ నేపధ్యంలో తమిళ స్టార్ హీరో శింబుతో కలిసి ఓ ప్రాజెక్ట్ లో నటించనున్నట్లు సమాచారం. ఇందులో అమ్మడు పోలీస్ గెటప్ లో కనిపించనుందట. రాశి ఇదివరకు ఓసారి సుప్రీం సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించింది. మళ్ళీ ఇన్నాళ్లకు పోలీస్ వేషం వేస్తుంది.