
తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రం "అర్జున్ రెడ్డి". అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండకు క్రేజ్ విపరీతంగా పెరిగి, సెన్సేషనల్ స్టార్ ను చేసింది. ఈ చిత్రంను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే హిందీలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి రీమేక్ అయిన కబీర్ సింగ్ ను డైరెక్ట్ చేసాడు. హిందీలో సైతం రికార్డులు బద్దలు కొట్టింది. ఇకపోతే ఇదే సినిమా తమిళ్ లో చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా "ఆదిత్య వర్మ" అనే పేరుతో తెరకెక్కింది. ఆదిత్య వర్మ సినిమా ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకున్న తర్వాత ఎట్టకేలకు శుక్రవారం రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో ఎక్కువ శాతం స్మోకింగ్, డ్రింకింగ్ సీన్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కారణంతో ధృవ్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. సినిమాలో అధికభాగం స్మోకింగ్, డ్రింకింగ్ సీన్లు ఉన్నాయంటూ నోటీసులో పేర్కొన్నారు. అంతేకాదు "మార్కెట్ ర్వాజ ఎంబీబీఎస్" సినిమాలో సిగార్ కాల్చినందుకు రాధిక శరత్ కుమార్ కు కూడా నోటీసులు వెళ్లాయి. మరి దీనిపై వీరు ఎలా స్పందిస్తారో చూడాలి.