
ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తన బ్లాక్ బస్టర్ మూవీ 'పెళ్లి సందడి'కి సీక్వెల్ ప్రకటించారు. ఇది 1996 లో విడుదలైంది. పెళ్లి సందడి చిత్రంలో శ్రీకాంత్, రవలి, దీప్తి భట్నాగర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, బ్రాహ్మనందం, తనీకెళ్ల భరణి, బాబు మోహన్, ఎం బలయ్య, శివాజీ రాజా, ఎవిఎస్, రాజా రవీంద్ర, మరియు ఇతరులు కూడా అద్భుతంగా నటించారు. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రాన్ని నిర్మించడమే చేయడమే కాకుండా, రాఘవేంద్రరావు సీక్వెల్ ను దగ్గరుండి పర్యవేక్షించబోతున్నారు. 24 సంవత్సరాల విరామం తరువాత, రాఘవేంద్రరావు ఈ బ్లాక్ బస్టర్ సిక్వెల్ తో వస్తున్నారు. ఈనేపధ్యంలో దర్శకేంద్రుడు సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన చేసారు. అయితే ఈ సిక్వెల్పె లో హీరోగా శ్రీకాంత్ పెద్ద కుమారుడు రోషన్ నటించనున్నారని తెలుస్తుంది.