
రాహుల్ రామకృష్ణ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి క్రేజ్ దక్కించుకున్న రాహుల్ ఆ తర్వాత హిట్ సినిమాలైన
గీత గోవిందం, హుషారు లాంటి వాటిల్లో తనదైన పాత్ర పోషించారు. ఇటీవల అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా 'అల.. వైకుంఠపురములో' సినిమాలో నటించి మెప్పించాడు. అయితే తాజాగా చిన్నతనంలో లైంగిక వేధింపుకు గురయ్యానని వెల్లడించారు. సోమవారం రాహుల్ రామకృష్ణ తన ట్విట్టర్లో “నేను
బాల్యంలో అత్యాచారంకు గురయ్యాను. నా బాధ ఆవేదన గురించి ఇంకేం చెప్పాలో నాకు తెలియదు. ఇది తప్పా, ఇంక నన్ను బాధ పెట్టేవి ఏమి లేవు" అని ట్వీట్ చేసాడు. రాహుల్ ట్వీట్ కు కమెడియన్ ప్రియదర్శి రిప్లై ఇస్తూ "నువ్వు అనుభవించిన నరకం గురించి నేను ఎంత ప్రయత్నించినా అర్ధం కాదు. కానీ ఒకటి చెప్తున్న, నువ్వు అన్నిటిని ఎదురుకొని వచ్చావు. స్ట్రాంగ్ గా ఉండు తమ్ముడు" అని ట్వీట్ చేసాడు.