
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ సీజన్ లో ఎలిమినేట్ అయినా హౌస్ మేట్స్ ను ఇంటర్వ్యూ చేస్తూ ఒక షో చేస్తున్నాడు. కాబట్టి ఈ సీజన్ ను బాగా ఫాలో అవుతున్నాడు. అందుకే ఆమధ్య మీ ఫెవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని అడగగా దానికి రాహుల్ 'మా అన్న నోయల్ కానీ అయన ఇంటి నుండి వచ్చేసాడు కాబట్టి ఉన్న వాళ్లలో అభిజీత్. అలానే అరియానా, సోహెల్ లు కూడా బాగా ఆడతారు కానీ విన్నర్ అయ్యే అవకాశాలు అభిజీత్ కు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. తాజాగా రాహుల్ అతని ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన పోస్ట్ చూస్తుంటే ప్లేట్ ఫిరాయించినట్లుగా తెలుస్తుంది. 'నా ఫెవరెట్ కంటెస్టెంట్స్ అరియానా, సోహెల్. ఆట బాగా ఆడేవాళ్లకి జెన్యూన్ గా ఉండే వాళ్ళకి ఓటు వెయ్యండి. దమ్ముంటే సపోర్ట్..పనికిరాని వాళ్లని బయటకు తొయ్యండి' అంటూ పోస్ట్ పెట్టాడు. మొన్నటి వరకు అభిజీత్ అన్న రాహుల్ ఇప్పుడు ఇలా మాట్లాడటంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలయింది. నువ్వు ఎం ఆడావో, ఎంత జెన్యూన్ గా ఉన్నవో మర్చిపోయావా అంటూ ట్రోల్ చేస్తున్నారు.