
తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో 'బిగ్ బాస్' మొదలవుతుందంటే చాలు రకరకాల వార్తలు పుట్టుకొస్తాయి. రోజుకో సంచలనం నెలకుంటుంది. ఇప్పటికే బిగ్ బాస్-4 సెప్టెంబర్ 6న రాబోతుందని నిర్వాహకులు చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఎంపికైన కంటెస్టెంట్లను హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో క్వారెంటైన్ లో ఉంచడం జరిగింది. అయితే బిగ్ బాస్-3 లో సింగర్ రాహుల్, నటి పునర్నవి చేసిన రచ్చ గురించి తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం మరోసారి రాహుల్, పునర్నవిని షోకు తీస్కొస్తున్నారు. కానీ కంటెస్టెంట్లగా కాదు. గత సీజన్ తో ఎలిమినెట్ అయిన వారిని ఇంటర్వ్యూ చేసే బిగ్ బాస్ బజ్ అనే ప్రోగ్రాంను నిర్వాహకులు ప్రారంభించిన విషయం తెలిసిందే. గత బిగ్ బాస్ బజ్ కు సీజన్ 2 కంటెస్టెంట్ తనీష్ యాంకర్ గా వ్యవహరించగా ఈసారి రాహుల్-పునర్నవిలు ఆ బాధ్యత తీసుకోబోతున్నట్లు సమాచారం. సీజన్-4 లో ఎలిమినెట్ అయిన వారిని ఈ హాట్ కపుల్ ఇంటర్వ్యూ చేయనున్నారు.