
సినీ పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, మరోసారి ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్ చేతులు కలపబోతున్నారు. కానీ ఈసారి సినిమా చేయటానికి కాదు. సినిమాలు తీయటానికి. అయితే బాహుబలి దర్శకుడు, ప్రభాస్ ఇద్దరూ కలిసి సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అందుతున్న వార్త నిజమే అయితే, వారు తమ కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత కలిసి ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. శంకర్, సురేందర్ రెడ్డి వంటి అగ్ర దర్శకులు ప్రభాస్తో సినిమా చేయాలనుకున్నా యంగ్ రెబెల్ స్టార్ మాత్రం రాజమౌళితో కలిసి నిర్మాణ సంస్థపై దృష్టి పెట్టేందుకు నిర్ణయించుకున్నాడు. రాజమౌలి మరియు ప్రభాస్ కలిసి ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించి, వారి కొత్త చిత్రమే తమ మొదటి చిత్రంగా ఉండాలని కోరుకుంటున్నారని, ఇది పాన్-ఇండియా చిత్రంగా ఉంటుందని వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ తన కొనసాగుతున్న ప్రాజెక్ట్ 'జాన్' లో బిజీగా ఉన్నాడు. మరోపక్క రాజసమౌళి ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉన్నాడు.