
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చూరుకైన వేగంతో సాగుతున్న ఈ చిత్ర షూటింగ్ ను జూన్ లో ముగించి, ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే చిరు సైరా పూర్తి అవ్వడం కోసం సంవత్సరంకు పైగా వెయిట్ చేసిన కొరటాల శివ, ఇక రిలాక్స్ అవ్వకుండా షూటింగ్ ను జరుపుతున్నాడు. ఈ సినిమా రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అభిమానులు మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ను తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే కొరటాల శివ మాత్రం కంగారు పడుతున్నాడు. దానికి కారణం, ఆర్ఆర్ఆర్ రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వటం. రాజమౌళి కండిషన్ ప్రకారం ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ముందు ఏ సినిమాలో కనిపించకూడదు. ఎం చేయాలా అనే సందిగ్ధంలో ఉన్న శివకు సహాయం చేసేందుకు మెగాస్టార్ రంగంలోకి దిగారు. ఈ విషయమై రాజమౌళితో మాట్లాడతానని అన్నారట. వారంలో రాజమౌళిని కలిసి చిరు, రామ్ చరణ్ గురించి మాట్లాడనున్నారు.