
బాహుబలి సిరీస్ తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నటులైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో 'ఆర్ఆర్ఆర్' అనే ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నాడు. కరోనా రావటంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. అయినా కూడా అభిమానులను నిరాశపరచకుండా అల్లూరి సీతారామరాజు టీజర్ ను విడుదల చేసింది టీం. అలానే, ఎన్టీఆర్ కొమరం భీమ్ టీజర్ కూడా వస్తుందనుకుంటే నిరాశే మిగిలింది. అయితే తాజా మీడియా ఇంట్రాక్షన్ లో రాజమౌళి కొమరం భీమ్ టీజర్ పై స్పందించారు. ఒకవేళ షూటింగ్ స్టార్ట్ అయితే పది రోజుల తర్వాత తారక్ కి సంబంధించిన విజువల్స్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్ అప్డేట్ ఇస్తామని రాజమౌళి స్పష్టం చేశారు. దీంతో 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని తారక్ అభిమానులు ఉత్సాహంతో వెయిట్ చేస్తున్నారు.