
బాహుబలి లాంటి మాగ్నమ్ ఓపస్ తీసిన దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పుడు మరో పెద్ద బడ్జెట్ ఎంటర్టైనర్ 'ఆర్ఆర్ఆర్' తో రాబోతున్నారు. ఇది ఇద్దరు అగ్ర తారలు- జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లతో తెరకెక్కించబడుతుంది. అయితే ఇటీవల కరోనా భారిన పడి కోలుకుని రాజమౌళి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి, ఆర్ఆర్ఆర్, ప్రభాస్ రాబోయే చిత్రం ఆదిపురుష్ గురించి మాట్లాడారు.
ప్రభాస్ రాబోయే చిత్రం 'ఆదిపురుష్' గురించి రాజమౌళిని అడిగినప్పుడు, దానికి సమాధానమిస్తూ, “ఓం రౌత్” దర్శకత్వం వహించనున్న ఆదిపురుష్ సరైన సమయంలో రాబోతుంది. రాముడి అవతారంలో ప్రభాస్ నటించనున్న ఈ చిత్రం ప్రభాస్ కెరియర్ ను మరో స్థాయికి తీసుకెళ్తుందని" చెప్పారు.