
బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ లోని ఇద్దరు బడా హీరోలు రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ లతో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్పోషిస్తున్న పాత్ర అల్లూరి సీతారామరాజు టీజర్ ను జూ.ఎన్టీఆర్ వాయిస్ తో రిలీజ్ చేసి భారీ అంచనాలను పెంచారు. ఇక అప్పటి నుంచి జూ.ఎన్టీఆర్ నటిస్తున్న కొమరం భీమ్ టీజర్ ఎప్పుడొస్తుందాని ఎదురుచుస్తూనే 5నెలలు గడిచిపోయాయి. ఎట్టకేలకు లాక్డౌన్ ముగియడంతో నిన్న కొమరం భీమ్ టీజర్ ను విడుదల చేసారు. రెండు టీజర్ల విషయంలో రాజమౌళి ఒకే ఫార్మాట్ వాడినప్పటికి ఎన్టీఆర్ టీజర్ లో పలు షాట్లు హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టినట్లుగా ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పెడుతున్నారు నెటిజన్లు. అయితే రాజమౌళికి కాపీ కొట్టడం కొత్తేమి కాదు. ఆయన సినిమాల్లో చాలా సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాల నుంచి కాపీ కొడతారు. కానీ అది ఎక్కడ కనిపియకుండా జక్కన్న తన స్క్రీన్ ప్లేతో మాయ చేస్తాడు. అందుకే ఈసారి కూడా కాపీ కొట్టడం కామనే హిట్టు కొట్టడము కామనే.