
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక దిగ్గజం రాజమౌళి. తెలుగు ప్రజలు జక్కన్న అని అభిమానంతో పిలుచుకునే రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ బడా హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో 'RRR ' సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తార స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తుంటే ఊహించని పరిస్థితుల వల్ల ఆలస్యం అవుతూనే ఉంది. అయితే ఏ మాత్రం తగ్గని కరోనా కేసులు చూసి రాజమౌళి ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. గ్లోబల్ తారాగణం ఉండటంతో ఇండియాలో షూట్ ను ప్లాన్ చేయటం ఎలా అనేది ఒకటి అయితే, ఎక్కడ అనేది మరో సమస్య. సినిమా ప్రారంభం నుంచి రాజమౌళికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరి వీటిని అధిగమించి జక్కన్న షూట్ ప్లాన్ చేస్తారో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.