
ఆర్ఆర్ఆర్ టైటిల్పై చాలా ఉహాగానాలు ఉన్నాయి. ఉగాది సందర్భంగా ఈ చిత్ర నిర్మాతలు టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల, రాజమౌళి మరియు బృందం రఘుపతి రాఘవ రాజారామ్ అనే టైటిల్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పుకార్లు వచ్చాయి. చివరకు అన్ని పరిగణనలోకి తీసుకొని, వారు ఈ టైటిల్ కె ఫిక్స్ అయినప్పుడు, ఇప్పటికే మరొకరిచే ఈ టైటిల్ రిజిస్టర్ చేయబడిందని తెలిసింది. కాబట్టి ఆర్ఆర్ఆర్ మేకర్స్ రిజిస్టర్ చేసినవారిని సంప్రదించినప్పుడు, రాజమౌళి, డివివి దానయ్యలకు టైటిల్ హక్కులు ఇవ్వడానికి భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారని చెబుతున్నారు. మొత్తానికి దీనికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. ఉహించిన విధంగా జరగపోతే, ఆర్ఆర్ఆర్ కు రామ రావణ రాజ్యం టైటిల్ తప్ప మరే అప్షన్ లేదు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జనవరి 8న 2021లో రిలీజ్ కానుంది.