
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న "ఆర్ఆర్ఆర్" తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెడుతుంది. అలియా భట్ సీత పాత్రను పోషిస్తుంది. అక్టోబర్ నెలలో విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ తో అలియా భట్ రొమాన్స్ చేయనుంది. అయితే ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా అలియా భట్ తనకు ప్రైవేట్ జెట్ కొనాలనే మనసులోని కోరికను బయట పెట్టింది. బడ్జెట్లో ఎలా జీవించాలో తనకు తెలుసని...మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టాలని ఆమె అన్నారు. ముంబైలోని తన ఇల్లు తాను కొనుగోలు చేసిన మొదటి ఆస్తి అని ఆమె అన్నారు. అలియా భట్, తాను సంవత్సరానికి ఒక వెకేషన్ తీసుకుంటానని, వెళ్లే ప్రదేశానికి మరియు హోటల్ కోసం డబ్బు ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చింది. అయితే తనకు ఒక ప్రైవేట్ జెట్ మరియు పర్వతాలలో ఒక ఇల్లు ఉండాలనే తన కోరికను మీడియా ముఖంగా బయట పెట్టింది.