
హీరోలకు ఎంత క్రేజ్ అయితే ఉంటుందో కొంతమంది దర్శకులకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అలాంటి దర్శకుల్లో ఎస్ ఎస్ రాజమౌళి ముందంజలో ఉంటారు. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ చిత్రం లేకపోగా ఒక్క సినిమాతో అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ మాస్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో 'ఆర్ఆర్ఆర్' తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అన్ని అడ్డంకులను ఎదురుకుంటూ ఎట్టకేలకు అక్టోబర్ 13న వచ్చేందుకు సిద్ధమైంది. మరి ఈ సినిమా తర్వాత జక్కన్న మహేష్ తో సినిమా తీస్తాడా? అనేది ప్రస్తుతం నడుస్తున్న చర్చ. లాక్ డౌన్ లోనే దర్శకుడు ఓ ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ఇక ఈ ఎడాది చివరలో సినిమాను సెట్స్ పైకి తేవాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారట. రీసెంట్ గా మహేష్ బాబు రాజమౌళి ఇదే విషయంపై ఫోన్ కాల్ ద్వారా చర్చించుకున్నట్లు సమాచారం. రాజమౌళి కోసం మహేష్ ఒక స్పెషల్ లుక్ లోకి అయితే మరాల్సి ఉందట. మహేష్ ను మాత్రం బిగ్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ అనేలా ప్రజెంట్ చేయాలని దర్శకుడు భారీ ప్లాన్స్ వేసినట్లు సమాచారం.