
తెలుగు చిత్ర పరిశ్రమ గర్వంగా తలెత్తుకునేలా చేసిన దర్శక దిగ్గజం రాజమౌళి. బాహుబలి సినిమాతో హాలీవుడ్ స్థాయి సినిమా తెలుగు దర్శకుడు తియ్యగలడని నిరూపించాడు. బాహుబలి తర్వాత టాలీవుడ్ బడా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో 'ఆర్ఆర్ఆర్' సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరడంతో పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టి అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని ప్రకటించింది. అయితే ముందు అక్టోబర్ 8న రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ ఇందులో నటిస్తున్న హాలీవుడ్ నటి లీక్ చేయటం అలాగే అదే రోజు హాలీవుడ్ బాండ్ మూవీ రిలీజ్ అవుతుండటంతో అక్టోబర్ 13కు పోస్ట్ పోన్ చేయటం జరిగింది. ఎంత హాలీవుడ్ స్థాయిలో తీసినప్పటికి హాలీవుడ్ మూవీతో రిలీజ్ చేస్తే వసూళ్ల పై దెబ్బ పడుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట.